SNAPDEAL

Why godse killed Gandhi??

                                              జాతిపిత మహాత్మా గాంధీ జనవరి 30న హత్యకు గురయ్యారు. దేశవిభజన అనంతర పరిణామాల నేపథ్యంలో గాంధీ తీరు రుచించని అతివాదులు ఆయన్ను కాల్చి చంపారు. ఆయన హత్య ఒక్క ఇండియానే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 1948, జనవరి 30న ఆయన హత్యకు గురయ్యారు. వరుస ఉద్యమాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి కొరకరాని కొయ్యగా మారిన గాంధీ శరీరం మూడంటే మూడు తూటాలకు కుప్పకూలింది. ఆయన హత్యకు దారి తీసిన తక్షణ పరిస్థితులు, అంతకుముందు జరిగిన పరిణామాలపై వివరంగా తెలుసుకుందాం.                                                                             విభజన జరగకపోతే దేశంలో అంతర్యుద్ధం తప్పదని ముస్లింలీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా హెచ్చరించాడు. దీంతో ఇష్టం లేకున్నా గాంధీ విభజనకు అంగీకరించారు. ఆ సమయంలో వేరుపడిన పాకిస్తాన్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రూ.75 కోట్లు ఇవ్వాలి. విభజన సమయంలో రూ.20 కోట్లు ఇచ్చిన భారతదేశం మిగిలిన డబ్బును ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇస్తే.. ఆ డబ్బుతో తిరిగి భారత్‌పైనే యుద్ధానికి దిగుతుందన్న భయమే కారణం. అయితే, ఈ డబ్బు ఇవ్వకపోతే అంతకుమించిన నష్టం జరుగుతుందని గాంధీ ఆందోళన చెందారు. అందుకే బాకీ డబ్బులు చెల్లించాలంటూ 1948, జవనరి 13న దీక్షకు దిగారు.దీంతో డబ్బు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. పాకిస్తాన్ కోసం గాంధీ దీక్షకు దిగడం దేశంలో చాలామందికి రుచించలేదు. భారత్‌లో విలీనమైన కశ్మీర్‌ను సగం ఆక్రమించుకుని, పాకిస్తాన్‌లో హిందువులు, సిక్కుల ఊచకోతకు పాల్పడుతున్న శత్రుదేశానికి ఆర్థిక సాయం కోసం దీక్షకు దిగడాన్ని కొందరు అతివాదులు ఖండించారు. ఈలోగా నాధూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే నేతృత్వంలో గాంధీ హత్యకు కుట్ర సిద్ధమైంది.                                                                                                                               Do you know? 
     1. గాంధీ హత్య ఎఫ్‌ఐఆర్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది.                                                                            2. నాధూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే గాంధీని హత్య చేసేందుకు బొంబాయి నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చారు                                                                                                            3. జనవరి 20న బాంబు పేల్చిన మదన్‌లాల్ ధైర్యవంతుడైన కుర్రాడు అని గాంధీ అభివర్ణించాడు.                                                                                                                                                4. గాడ్సే కాల్చిన తూటాల్లో ఒకటి ఛాతిలోకి దూసుకెళ్లింది. మిగిలిన రెండు పొట్టలోకి చొచ్చుకెళ్లాయి.                                   5. ఈ కుట్రలో పాల్గొన్న వారంతా ముంబై రాష్ట్రానికి చెందినవారే.                                                                                                6. గాంధీని చంపడానికి మొత్తం 5 సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి.                                                                                7. నాధూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టేలను 1949, నవంబరు 15న ఉరితీశారు.                                                                                                తొలిప్రయత్నం విఫలంకావడం, మదన్‌లాల్ పోలీసులకు దొరికిపోవడంతో మిగిలిన వారు పరారయ్యారు. పోలీసుల నిఘా పెరగడంతో ఈసారి పథకం విఫలం కాకూడదని నాధూరం గాడ్సే కాల్పులు జరపాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా పదిరోజుల అనంతరం 1948, జనవరి 30 సాయంత్రం 5.17 నిమిషాలకు బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతుండగా.. ఆయనకు నాధూరాం గాడ్సే ఎదురుపడ్డాడు. గాంధీకి నమస్కరించాడు. ఇప్పటికే ఆలస్యమైందంటూ గాడ్సేను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేయబోయింది గాంధీ అనుచరురాలు అఛా ఛటోపాధ్యాయ. కానీ ఆమెను పక్కకు నెట్టిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడుసార్లు పాయింట్‌బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు. దేశ స్వాతంత్య్రోద్యమానికి నేతృత్వం వహించిన మహానుభావుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే పోలీస్.. పోలీస్! అని అరుస్తూనాధూరాం గాడ్సే లొంగిపోయాడు.                                                                                                                   గాంధీ హత్యలో నాధూరం గాడ్సే, నారాయణ్ ఆప్టేతోపాటు మిత్రులు సావర్కర్, విష్ణు కర్కరే, శంకర్ కిష్టయ్య, గోపాల్ గాడ్సే, మదన్‌లాల్ బహ్వా, దిగంబర్ బడ్గే చేతులు కలిపారు. అంతా కలిసి ఎలాగైనా గాంధీని అంతమొందించాలని సిద్ధమయ్యారు. హత్య జరిగిన తరువాత పారిపోకూడదని, తమ ఉద్దేశం అందరికీ తెలియపరిచేలా లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 20న ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో గాంధీని హత్య చేయాలనుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం.. గాంధీ ప్రసంగిస్తున్న వేదిక వెనక వైపు ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ నుంచి కాల్పులు జరపాలనుకున్నాడు దిగంబర్ బడ్గే. కానీ, కుదరలేదు. అక్కడ ఉన్న కిటికీ నుంచి గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే బాంబు విసురుదామనుకున్నాడు. కానీ, అది మరీ ఎత్తుగా ఉండటంతో అతనికీ సాధ్యపడలేదు. దీంతో వేదిక వద్ద కూర్చున్న మదల్‌లాల్ బాంబు విసిరాడు. కానీ, హత్యాప్రయత్నం విఫలమైంది. మదన్‌లాల్ పోలీసులకు దొరికిపోయాడు.
Credit: sakshi.com
గాంధీ హత్యకు.. కుట్ర జరిగిందిలా..!

Unknown facts about Mahatma Gandhi

                           We all know Mahatma Gandhi as the man who led our country to freedom. The following are 16 facts about Mahatma Gandhi that are mostly unknown:
1. Mahatma Gandhi was nominated for the Nobel Peace prize 5 times
The committee regrets not giving him the Nobel Peace prize to this day as the award is never given posthumously. 

2. M. K. Gandhi was responsible for the Civil Rights movement in 4 continents and 12 countries

3. The funeral procession of Mahatma Gandhi was 8 kilometers long

4. Great Britain, the country against whom he fought for independence, released a stamp honouring him, 21 years after his death.Image source

5. Mahatma Gandhi walked/traveled almost 18 kilometers a day throughout his lifetime which is enough to walk around the world twice over.




Image source

6. Gandhiji served in the army during the Boer war – he crusaded against violence since the time he realized the horrors of war.Image source

7. Mahatma Gandhi corresponded with a lot of people – Tolstoy, Einstein and Hitler were among the many.



Image source

8. Gandhiji was not present during Nehru’s tryst of destiny speech to celebrate independence.

Image sourceHe was in Kolkata fasting for religious harmon

9. Most relics of Gandhiji including the clothes he wore when he was shot are still preserved in Gandhi MusMaduraidurai.



Image source


10. He never held an official position in any political body during the final years of his life.




Image source


11. He was thinking of dissolving the Congress a day before he died.




Image source


12. Steve Jobs was a fan of Mahatma Gandhi – his round glasses are not only similar but also a tribute.




Image source

13. Gandhiji had a set of false teeth, which he carried in a fold of his loin cloth.Image source

14. Mahatma Gandhi spoke English with an Irish accent, for one of his first teachers was an Irishman.





Image source


15. There are 53 major roads (excluding the smaller ones) in India, and 48 roads outside India that are named after him.




Image source

16. Gandhiji helped establish 3 football clubs in Durban, Pretoria and Johannesburg all of which were given the same name: Passive Resisters Soccer Club.



Image source

Mahatma Gandhi promoted football in his non-violent campaign against racial discrimination. 

రోహిత్ ఆత్మహత్య... మీడియా తీరు


హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పరిశోధక విద్యార్థి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరం. మేధస్సు, సామాజిక స్పృహ, అంతకు మించి మనుషుల మీద ప్రేమ ఉన్న ఓ యువకుడి మరణం సమాజానికి కచ్చితంగా లోటే. 
                 ఈ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు, ఆత్మహత్య అనంతరం జరుగుతున్న పరిణామాలు దేశాన్ని ప్రేమించే ప్రతిఒక్కరికీ తీవ్ర ఆందోళన కలిగించేవే.
ఆత్మహత్యకు గల కారణాలను పరిశీలిస్తే; దేశంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో లాగానే, హెచ్.సి.యు. లో కూడా కుల సంఘాలు, మావోయిస్ట్ సానుభూతి సంఘాలు, ముస్లిం అతివాద సంఘాలు, హిందూ అతివాద సంఘాలు, మితవాద సంఘాలు ఉన్నాయి. యాకుబ్ మెమన్ ఉరిశిక్ష అమలు సందర్భంగా దాన్నివ్యతిరేకిస్తూ అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రోహిత్ సహా కొందరు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. దీన్ని ఖండిస్తూ ఏబివిపి నాయకుడు సుశీల్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్న దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. దీనిపై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని సుశీల్ పై అంబేద్కర్ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేసారనేది ఒక వాదన. అలాంటిదేమీ జరగలేదని ఒక వాదన. మొదటి వాదనని నమ్మిన యూనివర్సిటీ (పోలీసు కేసులు వగైరా చూసి) అధికారులు రోహిత్ సహా మరో నలుగురు విద్యార్థుల్ని సస్పెండ్ చేయడం, ఈ మధ్యలో దత్తాత్రేయ ఉత్తరం ఇవన్నీ మనకి తెలిసినవే. ఒకవేళ నిజంగా సుశీల్ పై దాడి జరిగి ఉంటే, విద్యార్థుల్ని సస్పెండ్ చేయడం సమంజసమే. దాడి జరగకుండా తప్పుడు ఆధారాలు చూపి, విద్యార్థుల్ని సస్పెండ్ చేస్తే దానికి బాధ్యులని శిక్షించాల్సిందే. త్వరగా న్యాయం జరగాలని ఇరువర్గాలు ఆందోళన చేయడం కూడా సమంజసమే. అయితే..

              ఈ ఘటన దళితులకి అగ్రవర్ణాల వారికి మధ్య జరిగిన సంఘటన కాదు. దళితులు తమ హక్కుల కోసం పోరాడితే, ప్రశ్నిస్తే, దాన్ని అగ్రవర్ణాలు అడ్డుకుని హింసకు దిగితే, లేదా ఇబ్బందులకి గురి చేస్తే అప్పుడు దాన్ని కులపరమైన ఘర్షణగా చూడాలి. కాని, ఇక్కడ జరిగింది యాకుబ్ మెమన్ ఉరిశిక్షను వ్యతిరేకించే వ్యక్తులకి, సమర్థించే వ్యక్తులకి మధ్య ఘర్షణ. దీన్ని రెండు వాదనల మధ్య ఘర్షణగా చూడాలి తప్ప దళిత అగ్రవర్ణాల మధ్య ఘర్షణగా కాదు. దళిత విద్యార్థి ఆత్మహత్య అని పత్రికలూ బ్యానర్ ఐటమ్స్ రాయడం, ఆ కోణంలో టీవీ చానల్స్ చర్చలు జరపడం, కేవలం సమాజంలో విద్వేషాలు పెంచడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడదు. పోనీ కులాల పేరుతోనే రిపోర్టింగ్ చేయాలని అనుకుంటే, ఆత్మహత్య చేసుకున్నవ్యక్తి కులాన్ని ప్రస్తావించే మీడియా, ఉత్తరం రాసిన కేంద్ర మంత్రి, బిసి అని ఎందుకు రాయలేదు? వివాదానికి కారణమైన సుశీల్ ది ఏ కులమో ఎందుకు రాయలేదు? నేషనల్ మీడియాగా చెప్పుకునే,టైమ్స్ నౌ వంటి మీడియా సంస్థలు కూడా గంటల తరబడి నిజాలని నిగ్గు తేల్చే విధంగ కాకుండా  కేవలం దళిత కోణంలో మాత్రమే డిబేట్ నిర్వహించడం మీడియాలో సాగుతున్న అనైతిక ప్రవర్తనకి ఒక చిన్న ఉదాహరణ మాత్రమె.. షేమ్ ఆన్ ఇండియన్ మీడియా.

సిగ్గులేదురా..!

బాబు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం కోసం బడి పిల్లలు నుండి తలా 10/- వసులు చేయాలని GO పాస్ చేసింది.ఇంతకన్నా తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదు.రాష్ట్రం మొత్తం మీద బడికి వెళ్ళే పిల్లలు 10 లక్షల మంది ఉంటే ( అన్ని స్కూల్స్ కలిపి) ,ఒక కోటి రూపాయలు  విరాళాలు సేకరించారనుకుందాం.కోటి రూపాయలతో రాజధాని కట్టగలరా?? లేదు కదా.మరి ఎందుకు ఇలాంటి చిల్లర పనులు?? మీ చెత్త నిర్ణయాలు వల్ల AP పరువు పోతుంది కదరా.
                                  బాబు గారు,మీకు నిజంగా AP పై చిత్త శుద్ధి వుండి,ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలంటే,ముందుగా మీ అవినీతి mla ల నుండి రాష్ట్రాన్ని కాపాడండి.రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాబంధుల్లా ప్రభుత్వ ఆర్ధిక వనరులని దోచుకుంటున్నారు.రాష్ట్రంలోని ఇసుక మాఫియా నుండి ముక్కు పిండి వాసులుచేసి ,వాటిని రాజధాని నిర్మాణం కి వాడండి .మీరు ,మీ mla లు జల్సాలు తగ్గించి వాటిని రాజధానికి ఖర్చుపెట్టండి.కేంద్రం నుండి హక్కుగా రావలసిన ఆర్ధిక సహాయంతో రాజధానిని కట్టండి,అప్పుడు ఆంధ్రులుగా సంతోషిస్తాం, అంతే కాని అడుక్కోవటమేంటి?? మీకు అధికారాన్ని ఇచ్చింది రాజధాని కోసం బిక్షమెత్తుతారని కాదు,హక్కుగా కేంద్రం నుండి సాదించుకొస్తారని.
                                      అయిన ప్రభుత్వానికి రాజధాని కోసం విరాళాలు ఎందుకివ్వాలి?? హుధుద్ కి ఇచ్చిన ,సేకరించిన విరాళాలు ఎవరికిచ్చారు?? ప్రభుత్వానికి విరాళాలు ఎంత వచ్చాయి,వాటిని ఎలా ఖర్చుపెట్టారో  లెక్కలు చెప్పగలరా??  లెక్కలు చెప్పలేనప్పుడు మళ్ళీ  విరాళాలు అడగడానికి సిగ్గులేదు??
                         

బల్దియాలో బాద్షా ఎవరు??

మరో రెండు రోజుల్లో ghmc  ఎన్నికలకు  సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.జనవరి 21 నుండి 25 మధ్యలో ఎప్పుడయినా ఎన్నికలు జరగొచ్చు.అధికార trs పార్టీ ghmc ఎన్నికల్లో వీలయినన్ని ఎక్కువ చోట్ల గులాబీ జెండా ఎగురవేయలని భావిస్తోంది. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీలకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది,కానీ ghmc లో trs పరిస్థితి అందుకు విరుద్ధం. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న trs నేతల్లో గ్రేటర్ ఓటర్ తీర్పు ఎలావుంటుందో అన్న ఆందోళన వుంది.
                                   Ts lo అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రేటర్ పీఠమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేసింది kcr ప్రభుత్వం. అందులో భాగంగా సిటీలో బలంగా వున్న టీడీపీ ,కాంగ్రెస్ లోని నాయకుల్ని తమ పార్టీలోకి తెచ్చుకోవడంలో  సక్సెస్ అయ్యారని చెప్పాలి.అయినప్పటికీ గ్రేటర్లో గెలుపుపై క్లారిటీ లేని తెరాస నాయకత్వం అధికారమే పరమావధిగా అడ్డ దార్లు తొక్కుతుంది.అందులో భాగంగానే  గ్రేటర్లో వార్డుల రిజర్వేషన్స్ ని ప్రకటించకుండా సాగదిస్తుంది, కాని  తెరాస కి చెందిన కొద్దిమంది  ద్వితీయ శ్రేణి నాయకులకు  వార్డుల రిజర్వేషన్స్ ని  తెలియచేసినట్టు రాజకీయ వర్గాల్లో వినికిడి.అందుకు తగ్గట్టుగా ఆయా వార్డులో ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం కూడా మొదలు పెట్టింది.trs గ్రేటర్లో మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.కొన్ని మీడియా సంస్థలను మేనేజ్ చేస్తూ రోజుకో ప్రేపోల్ సర్వేలతో ప్రత్యర్ధి పార్టీల్లో గుబులు పుట్టేలా చేస్తుంది.
                               అయితే ఇప్పుడు ఎన్నికల్లో తెరాస ఒంటరిగా బరిలో ఉంటుంది. టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తుండగా,mim,కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా బరిలో నిల్చున్నాయ్.గ్రేటర్ లో చిన్న పార్టీలయిన లోక్సత్తా,cpi,cpm లు వన్ హైదరాబాద్ గా ఏర్పడి ఎన్నికల కధనరంగంలోకి దిగాయి.గత ఎన్నికల్లో కాంగ్రెస్ -52,టీడీపీ-45,mim-44 స్థానాల్లో విజయం సాధించాయి.కాని అప్పటికి,ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారింది.ప్రస్తుత పరిస్థితిలో mim పార్టీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ 45 నుండి 55 స్థానాల్లో విజయం సాధించవచ్చు.mim పార్టీకి ఓల్డ్ సిటీలో ప్రస్తుత పరిస్థితిలో పోటీనిచ్చే పార్టీ కూడా లేదు.mim కి కొద్దోగొప్పో పోటీనిచ్చే MBT కూడ 2009 తర్వాత తన పట్టుని క్రమంగా కోల్పోతుంది.ఇక కాంగ్రెస్, టీడీపీ బీజేపీల ప్రభావం  ఓల్డ్ సిటీలో నామమాత్రం మాత్రమే.2009 తర్వాత mim తన పరిధిని పెంచుకుని మహేశ్వరం,రాజేంద్ర నగర్ వంటి నియోజకవర్గాల్లో బలపడుతూ వస్తుంది.
                           ఇక టీడీపీ గ్రేటర్ పై తన పట్టును కోల్పోతుంది.వరుసగా టీడీపీ నాయకులు తెరాస లో చేరడం,నోటుకు ఓటు వంటి సంఘటనలు వల్ల టీడీపీ ప్రతిష్ట మసకబారింది. గ్రేటర్లోని మెజారిటీ సెటిలర్లు 2014 జనరల్ ఎలక్షన్స్ లో టీడీపీ బీజేపీ
కూటమికి  అండగా నిల్చారు.అయితే ncbn కెసిఆర్ తో చెట్టాపట్టలేసుకొని తిరగడం మెజారిటీ సెటిలర్లు ఏ మాత్రం సహించలేకున్నారు.ఇది టీడీపీ విజయంపై ప్రభావం చూపుతుంది.బీజేపీకి గ్రేటర్ లో మంచి ఓటు బ్యాంకు వుంది.హిందూ మత పునాదుల మీద గ్రేటర్ అంతట బీజేపీ వ్యాపించింది.bjp 2009 లో సాధించిన 5 స్థానాల కన్న ఎక్కువ ఈసారి ఎన్నికల్లో ఎక్కువ చోట్ల జెండా ఎగురవేయనుంది.టీడీపీ - బీజేపీ పొత్తులో  గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గరిష్టంగా లాభ పడనుంది.
                               కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్లో సరైన నాయకత్వం లేదు,అయినప్పటికీ నగర శివారులో బలమైన కార్యకర్తలు వున్నారు.హస్తం పార్టీ నాయకులు అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టి పని చేసినట్లయితే 20-30 స్థానాల్లో విజయం సాధించవచ్చు. ఇక వన్ హైదరాబాద్ కూటమి ఎంతమేరకు ఫలితాలని ప్రభావితం చేస్తుందో వేచి చూడక తప్పదు.ఈ కూటమి అభ్యర్థులు malkajgiri లోక్సభ పరిధిలో,dilshuk nagar, lb nagar ప్రాంతాల్లో టీడీపీ బీజేపీ కూటమి గెలుపోటములను కొంతమేరకు  ప్రభావితం చేయొచ్చు. టీడీపీ బీజేపీ కూటమి గరిష్టంగా 35 స్థానాలు గెలవొచ్చు.
                             ఇక ysrcp కూడా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనుంది.ఆ పార్టీ అభ్యర్థులు గెలవకపోయినప్పటికి ,ప్రభుత్వ  వ్యతిరేక ఓటును మాత్రం చీల్చనుంది.తెరాస ప్రభుత్వం చెబుతున్నట్టుగా 75 స్థానాలు గెలిచే పరిస్థితి లేదు.తెరాస mim సహాయంతో 40 స్థానాల్లో తమ జెండాని ఎగురవేయబోతుంది.mim పార్టీ తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని చోట trs కి బహిరంగ మద్దతు తెలుపబోతుంది.mim ,trs పార్టీలు బహిరంగంగా జత కట్టనప్పటికి పరస్పరం సహకరించుకోపోతున్నారు.
                                  ఎన్నికల తర్వాత ఎలాగూ ఏ పార్టీకి మెజారిటీ రాదు కనుక అధికార తెరాస mim తో జత కట్టి గ్రేటర్ పీఠాన్ని mim తో కలిసి పంచుకోపోతుంది.ఒవైసీ అన్నట్టు " ఏ శహర్ హమారా, మేయర్ హమారా" మేయర్ పీఠం mim చేతుల్లోకి వెళ్లనుంది.( తెరాస సహకారంతో). అంటే mim పార్టీ 3 ఇయర్స్,తెరాస 2 ఇయర్స్ గా మేయర్ పీఠాన్ని  షేర్ చేసుకుంటారన్నమాట.