SNAPDEAL

సిగ్గులేదురా..!

బాబు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం కోసం బడి పిల్లలు నుండి తలా 10/- వసులు చేయాలని GO పాస్ చేసింది.ఇంతకన్నా తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదు.రాష్ట్రం మొత్తం మీద బడికి వెళ్ళే పిల్లలు 10 లక్షల మంది ఉంటే ( అన్ని స్కూల్స్ కలిపి) ,ఒక కోటి రూపాయలు  విరాళాలు సేకరించారనుకుందాం.కోటి రూపాయలతో రాజధాని కట్టగలరా?? లేదు కదా.మరి ఎందుకు ఇలాంటి చిల్లర పనులు?? మీ చెత్త నిర్ణయాలు వల్ల AP పరువు పోతుంది కదరా.
                                  బాబు గారు,మీకు నిజంగా AP పై చిత్త శుద్ధి వుండి,ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలంటే,ముందుగా మీ అవినీతి mla ల నుండి రాష్ట్రాన్ని కాపాడండి.రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాబంధుల్లా ప్రభుత్వ ఆర్ధిక వనరులని దోచుకుంటున్నారు.రాష్ట్రంలోని ఇసుక మాఫియా నుండి ముక్కు పిండి వాసులుచేసి ,వాటిని రాజధాని నిర్మాణం కి వాడండి .మీరు ,మీ mla లు జల్సాలు తగ్గించి వాటిని రాజధానికి ఖర్చుపెట్టండి.కేంద్రం నుండి హక్కుగా రావలసిన ఆర్ధిక సహాయంతో రాజధానిని కట్టండి,అప్పుడు ఆంధ్రులుగా సంతోషిస్తాం, అంతే కాని అడుక్కోవటమేంటి?? మీకు అధికారాన్ని ఇచ్చింది రాజధాని కోసం బిక్షమెత్తుతారని కాదు,హక్కుగా కేంద్రం నుండి సాదించుకొస్తారని.
                                      అయిన ప్రభుత్వానికి రాజధాని కోసం విరాళాలు ఎందుకివ్వాలి?? హుధుద్ కి ఇచ్చిన ,సేకరించిన విరాళాలు ఎవరికిచ్చారు?? ప్రభుత్వానికి విరాళాలు ఎంత వచ్చాయి,వాటిని ఎలా ఖర్చుపెట్టారో  లెక్కలు చెప్పగలరా??  లెక్కలు చెప్పలేనప్పుడు మళ్ళీ  విరాళాలు అడగడానికి సిగ్గులేదు??