మరో రెండు రోజుల్లో ghmc ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.జనవరి 21 నుండి 25 మధ్యలో ఎప్పుడయినా ఎన్నికలు జరగొచ్చు.అధికార trs పార్టీ ghmc ఎన్నికల్లో వీలయినన్ని ఎక్కువ చోట్ల గులాబీ జెండా ఎగురవేయలని భావిస్తోంది. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీలకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది,కానీ ghmc లో trs పరిస్థితి అందుకు విరుద్ధం. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న trs నేతల్లో గ్రేటర్ ఓటర్ తీర్పు ఎలావుంటుందో అన్న ఆందోళన వుంది.
Ts lo అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రేటర్ పీఠమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేసింది kcr ప్రభుత్వం. అందులో భాగంగా సిటీలో బలంగా వున్న టీడీపీ ,కాంగ్రెస్ లోని నాయకుల్ని తమ పార్టీలోకి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.అయినప్పటికీ గ్రేటర్లో గెలుపుపై క్లారిటీ లేని తెరాస నాయకత్వం అధికారమే పరమావధిగా అడ్డ దార్లు తొక్కుతుంది.అందులో భాగంగానే గ్రేటర్లో వార్డుల రిజర్వేషన్స్ ని ప్రకటించకుండా సాగదిస్తుంది, కాని తెరాస కి చెందిన కొద్దిమంది ద్వితీయ శ్రేణి నాయకులకు వార్డుల రిజర్వేషన్స్ ని తెలియచేసినట్టు రాజకీయ వర్గాల్లో వినికిడి.అందుకు తగ్గట్టుగా ఆయా వార్డులో ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం కూడా మొదలు పెట్టింది.trs గ్రేటర్లో మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.కొన్ని మీడియా సంస్థలను మేనేజ్ చేస్తూ రోజుకో ప్రేపోల్ సర్వేలతో ప్రత్యర్ధి పార్టీల్లో గుబులు పుట్టేలా చేస్తుంది.
అయితే ఇప్పుడు ఎన్నికల్లో తెరాస ఒంటరిగా బరిలో ఉంటుంది. టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తుండగా,mim,కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా బరిలో నిల్చున్నాయ్.గ్రేటర్ లో చిన్న పార్టీలయిన లోక్సత్తా,cpi,cpm లు వన్ హైదరాబాద్ గా ఏర్పడి ఎన్నికల కధనరంగంలోకి దిగాయి.గత ఎన్నికల్లో కాంగ్రెస్ -52,టీడీపీ-45,mim-44 స్థానాల్లో విజయం సాధించాయి.కాని అప్పటికి,ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారింది.ప్రస్తుత పరిస్థితిలో mim పార్టీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ 45 నుండి 55 స్థానాల్లో విజయం సాధించవచ్చు.mim పార్టీకి ఓల్డ్ సిటీలో ప్రస్తుత పరిస్థితిలో పోటీనిచ్చే పార్టీ కూడా లేదు.mim కి కొద్దోగొప్పో పోటీనిచ్చే MBT కూడ 2009 తర్వాత తన పట్టుని క్రమంగా కోల్పోతుంది.ఇక కాంగ్రెస్, టీడీపీ బీజేపీల ప్రభావం ఓల్డ్ సిటీలో నామమాత్రం మాత్రమే.2009 తర్వాత mim తన పరిధిని పెంచుకుని మహేశ్వరం,రాజేంద్ర నగర్ వంటి నియోజకవర్గాల్లో బలపడుతూ వస్తుంది.
ఇక టీడీపీ గ్రేటర్ పై తన పట్టును కోల్పోతుంది.వరుసగా టీడీపీ నాయకులు తెరాస లో చేరడం,నోటుకు ఓటు వంటి సంఘటనలు వల్ల టీడీపీ ప్రతిష్ట మసకబారింది. గ్రేటర్లోని మెజారిటీ సెటిలర్లు 2014 జనరల్ ఎలక్షన్స్ లో టీడీపీ బీజేపీ
కూటమికి అండగా నిల్చారు.అయితే ncbn కెసిఆర్ తో చెట్టాపట్టలేసుకొని తిరగడం మెజారిటీ సెటిలర్లు ఏ మాత్రం సహించలేకున్నారు.ఇది టీడీపీ విజయంపై ప్రభావం చూపుతుంది.బీజేపీకి గ్రేటర్ లో మంచి ఓటు బ్యాంకు వుంది.హిందూ మత పునాదుల మీద గ్రేటర్ అంతట బీజేపీ వ్యాపించింది.bjp 2009 లో సాధించిన 5 స్థానాల కన్న ఎక్కువ ఈసారి ఎన్నికల్లో ఎక్కువ చోట్ల జెండా ఎగురవేయనుంది.టీడీపీ - బీజేపీ పొత్తులో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గరిష్టంగా లాభ పడనుంది.
కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్లో సరైన నాయకత్వం లేదు,అయినప్పటికీ నగర శివారులో బలమైన కార్యకర్తలు వున్నారు.హస్తం పార్టీ నాయకులు అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టి పని చేసినట్లయితే 20-30 స్థానాల్లో విజయం సాధించవచ్చు. ఇక వన్ హైదరాబాద్ కూటమి ఎంతమేరకు ఫలితాలని ప్రభావితం చేస్తుందో వేచి చూడక తప్పదు.ఈ కూటమి అభ్యర్థులు malkajgiri లోక్సభ పరిధిలో,dilshuk nagar, lb nagar ప్రాంతాల్లో టీడీపీ బీజేపీ కూటమి గెలుపోటములను కొంతమేరకు ప్రభావితం చేయొచ్చు. టీడీపీ బీజేపీ కూటమి గరిష్టంగా 35 స్థానాలు గెలవొచ్చు.
ఇక ysrcp కూడా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనుంది.ఆ పార్టీ అభ్యర్థులు గెలవకపోయినప్పటికి ,ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాత్రం చీల్చనుంది.తెరాస ప్రభుత్వం చెబుతున్నట్టుగా 75 స్థానాలు గెలిచే పరిస్థితి లేదు.తెరాస mim సహాయంతో 40 స్థానాల్లో తమ జెండాని ఎగురవేయబోతుంది.mim పార్టీ తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని చోట trs కి బహిరంగ మద్దతు తెలుపబోతుంది.mim ,trs పార్టీలు బహిరంగంగా జత కట్టనప్పటికి పరస్పరం సహకరించుకోపోతున్నారు.
ఎన్నికల తర్వాత ఎలాగూ ఏ పార్టీకి మెజారిటీ రాదు కనుక అధికార తెరాస mim తో జత కట్టి గ్రేటర్ పీఠాన్ని mim తో కలిసి పంచుకోపోతుంది.ఒవైసీ అన్నట్టు " ఏ శహర్ హమారా, మేయర్ హమారా" మేయర్ పీఠం mim చేతుల్లోకి వెళ్లనుంది.( తెరాస సహకారంతో). అంటే mim పార్టీ 3 ఇయర్స్,తెరాస 2 ఇయర్స్ గా మేయర్ పీఠాన్ని షేర్ చేసుకుంటారన్నమాట.