SNAPDEAL

Reservations in india

భారత రాజ్యాంగం దేశంలో తరతరాలుగా సామాజికంగా,ఆర్ధికంగా అణచివేయబడిన కొన్ని వర్గాల ప్రజలకు కొన్ని ప్రత్యేక సదుపాయల్ని కల్పించింది,వాటినే మనం రిజర్వేషన్స్ అంటున్నాం.భారత్లో రిజర్వేషన్స్ ని ఇలా కూడా డిఫైన్ చేయవచ్చు " The setting aside of a certain percentage of vacancies in government institutions for members of backward and underrepresented communities (defined primarily by caste and tribe)."  భారత్ దేశములో 1950 జనవరి 26 నుండి రిజర్వేషన్స్ అధికారికంగా అమలులోకి వచ్చాయి.( బ్రిటిష్ వారికి ముందు కూడా దేశంలో  కొన్ని వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్స్ వుండేవి).అయితే సుప్రీంకోర్టు  ఆదేశాలు మేరకు రిజర్వేషన్స్ 50% కన్నా మించకూడదు.( ఒకానొక సందర్భంలో తమిళనాడు ప్రభుత్వం 69% రిజర్వేషన్స్ అమలు చేసింది.).
                                    ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని ఉన్నత వర్గాలు కూడా తమకు రిజర్వేషన్స్ కావాలని రోడ్డులేకుతున్నాయ్.ఉన్నత వర్గాల ప్రజలు రిజర్వేషన్స్ కారణంగా తాము వెనుకబడి పోయాం అనే భావనకొచ్చాయ్.ఇందులో కొంత నిజం కూడా వుంది.గుజరాత్లో  గత  కొంత కాలంలో జరిగిన పటేల్ ఉద్యమం అందులో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ పటేల్ ఉద్యమం ఎక్కువ కాలం నిలబడలేదు.పటేల్ ఉద్యమం కొద్ది కాలానికే చల్లబడడానికి ప్రధాన కారణం అందులో హేతుబద్దత లేకపోవడం.హేతుబద్దత లేని ,కొన్ని వర్గాల ప్రజల సెంటిమెంట్ తో వచ్చే ఉద్యమాలు ఎక్కువ కాలం వుండలేవు.గుజరాత్లోని పటేల్లు రిజర్వేషన్స్ కోసం ఉద్యమాలు చేయడమంటే,అది తెలుగు రాష్ట్రాలలోని రెడ్లు,కమ్మ, ,రావు,కాపు ( కాపులని రాయలసీమ లో బలిజ అని,తెలంగాణాలో నాయుడుగా పిలుస్తారు) వర్గాల ప్రజలు రిజర్వేషన్స్ కోసం ఉద్యమాలు చేయడం లాంటిది.
                    రిజర్వేషన్స్ ని వ్యతిరేకించే ప్రజలు ముందుగా రిజర్వేషన్స్ ఎందుకు కల్పించారో తెలుసుకోవాలి.రిజర్వేషన్స్ అనేవి కేవలం ఆర్ధిక వెనుకబాటు పై మాత్రమె కాక, మన సమాజంలో కొన్ని వందల సంవత్సరాలుగా నిమ్న కులాలు,దళితులుగా ముద్ర వేయబడి ,సామాజిక బహిష్కరణకి,అంటరాని వారిగా అణచివేయబడిన కొన్ని వర్గాల ప్రజలని  ప్రభుత్వ పాలనలో బాగస్వామ్యులను చేస్తూ,ఆర్ధికంగా నిలదొక్కుకొని,సమాజంలో అందరితో సమానంగా ఎదగడం కోసం కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఎదురవుతుంది.నేటి ఆధునిక సమాజంలో ఆర్థికంగా బలపడినప్పుడు,నిమ్న కులాల వారికి రిజర్వేషన్స్ ఎందుకు??  ఇక్కడ నాకు తెలిసిన కొన్ని సంఘటనలు చెప్తా.లోక్సభ మాజీ స్పీకర్ "జీఎంసీ.బాలయోగి " తను లోక్సభ స్పీకర్ గా ఉన్నప్పుడు తన సొంత ఊరు " ఎదురులంక" గ్రామంలో శివాలయ సంకుస్థాపనకి వెళ్ళినప్పుడు అతను దళితుడు అనే కారణంతో అక్కడి ప్రజలు అతన్ని  అడ్డుకోవడం జరిగింది.అప్పటికే ఆతను ఆర్థికంగా మంచి స్థాయిలో వుండి, లోక్సభ స్పీకర్ అయి వుండి ఏమి చేయలేని దుస్థితి.అందుకు కారణం మన కుల వ్యవస్థ.అయితే అది ఎప్పుడో జరిగిన ఘటన.ప్రస్తుత పరిస్థితి చూస్తే,హైద్రాబాద్లోని మెజారిటీ బ్రాహ్మణులు తమ ఇళ్లను దళితులకి,తక్కువ కులస్తులకి  రెంటుకు ఇవ్వరు అంటే నమ్మకపోవచ్చు,కాని నిజం.
                                   అయితే రిజర్వేషన్స్ కి ఆల్టర్నేట్ లేదా?? అంటే ,ప్రస్తుతానికి సమాధానం లేకపోవచ్చు. రిజర్వేషన్స్ లేని భారత్ కావాలంటే ,ముందుగా కుల రహిత సమాజ నిర్మాణం జరగాలి.రిజర్వేషన్స్ తీసివేయలంటే ఉన్నత వర్గాలుగా సమాజంలో చెలామణి అవుతున్న ప్రజానీకం కులం ముసుగులో తాము పొందుతున్న కొన్ని ప్రత్యేక లాభాలని వదులుకోవలసి ఉంటుంది, ఇవి ఆర్ధిక పరమయినవి కావు,కేవలం సామాజిక పరమయినవి.అప్పుడు మాత్రమె కులసహిత రిజర్వేషన్స్ పోయి,ఆర్ధిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్స్ కి అవకాశం ఉంటుంది.అయితే ఇప్పుడు కొద్ది మంది యువత ,రిజర్వేషన్స్ అనుభవిస్తున్న వారిలో ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారికి రిజర్వేషన్స్ తీసివేసి,ఆర్ధికంగా వెనుక బడి వున్న ఉన్నత కులాల వారికి రెజర్వేషన్స్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇది వినడానికి కరెక్టుగా ఉన్నప్పటికీ ఆచరణ సాధ్యం కాకపోవచ్చు.ఎందుకంటే ప్రస్తుత సమాజంలో తప్పుడు  income certificate తెచ్చుకోవడం చాల సులభం,కాని తప్పుడు caste certificate అంత ఈజీగా రాదు,వచ్చిన భవిష్యత్తులో అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
                               అయితే రిజర్వేషన్స్ వాళ్ళ కొన్ని వర్గాల ప్రజలు తమకు అన్యాయం జరిగిందని ,జరుగుతుందని ఆవేదన చెందుతున్న మాట వాస్తవం. ఇప్పటికీ 65 years దాటినప్పటికి రిజర్వేషన్స్ కల్పించి,ఆయా వర్గాల ప్రజల్లో అనుకున్న స్థాయిలో అభివృద్ధి లేదని చెప్పాలి.ఇందుకు మన రాజకీయ వ్యవస్తే ప్రధాన కారణం. దేశంలో దళితుల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం కూడా చిత్త శుద్ధితో పనిచేయలేదు.కేవలం ప్రతి 5 years కి ఒక సారి వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ,తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికలప్పుడు మాత్రమే దళితులు ,వారి భాధలు గురించి ప్రభుత్వాలకి గుర్తుకు వస్తాయి.దీనికి  ప్రధాన కారణం దలితుల్లో చైతన్యం లేకపోవడం.కొద్దోగొప్పో చాయితన్యవంతులయిన దళితులు ఆయా రాజకీయ పార్టీలకి బానిసలుగా మారి ఊడిగం చేస్తున్నారు.  దళితుల్లో చైతన్యం రావాలి,అర్హులయిన వారికి కచ్చితంగా రిజర్వేషన్స్ అందేలా చూడడం ద్వారా మాత్రమె ,ఇంకో 20 years లో అయిన రిజర్వేషన్స్ అవసరంలేని భారత్ని చూడొచ్చు.ప్రభుత్వాలు కూడా తాత్కాలిక తాయిలాలు కాకుండా,అన్ని వర్గాల ప్రజలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేలా చూడడం మాత్రమే సర్వరోగ నివారిణి.

జమ్మలమడుగులో జగన్ బలప్రదర్శన!

జమ్మలమడుగు ysrcp mla ఆది నారాయణ రెడ్డి పార్టీకి కొంత కాలంగ  దూరంగా వుంటున్న సంగతి అందరికి తెలిసిందే.ఆది నారాయణ రెడ్డి పార్టీ మారుతారని చాలా కాలంగా మీడియా కోడై కూస్తుంది.కాని శనివారం రోజున ఆది నారాయణ రెడ్డికి జగన్ ఒక్కసారిగా షాక్ ఇచ్చారని చెప్పొచ్చు.చిన్న శుభ కార్యానికి వచ్చిన జగన్ తన అభిమానులు, కార్యకర్తలతో  భారీ ర్యాలీ చేసి ,ఆది నారాయణ రెడ్డి పార్టీ మారిన జమ్మలమడుగు ప్రజానీకం తన వెంటే ఉన్నారని నిరూపించారు.ఇక్కడ ఇంకో చెప్పుకోవలసిన విషయం ఏంటంటే ఆది నారాయణ రెడ్డి తమ్ముడు జగన్ని  కలవడానికి జగన్ వాహన శ్రేణి వద్దకి వచ్చినప్పటికీ జగన్ పట్టించుకోకుండా,అభిమానులకు అభివాదం చేస్తూ తన రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్డుషో కార్యక్రమం మొత్తం కూడా  ఆది నారాయణ రెడ్డికి తెలియకుండా,ysrcp జమ్మలమడుగు యువనేత హనుమంత రెడ్డి నాయకత్వంలో జరగడంతో ఆది నారాయణ రెడ్డి వర్గం లో ఆందోళన  మొదలేయింది.జగన్ సడన్ ర్యాలీ తో ఆది నారాయణ రెడ్డి పార్టీ మారిన అతని వెంట వెళ్ళే కార్యకర్తలు కొద్ది మంది మాత్రమె ఉంటారని,జగన్ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదని స్పష్టమయిందని చెప్పవచ్చు.మొత్తానికి ఆది నారాయణ రెడ్డి పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవాడిలా ఐయ్యిందని చెప్పాలి.ఇప్పుడు ఆది నారాయణ రెడ్డి వర్గంలో వున్నా ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అతనికి దూరంగా వుండి,జగన్ శిబిరం వైపు చూస్తున్నారట.జగన్ కూడా వెళ్ళే వాళ్ళ గురించి పెద్దగ పట్టించుకోను అనే సింబాలిక్ గానే ఈ ర్యాలీ చేసి , భళా ప్రదర్శన చేసాడనుకోవచ్చు.

Why Hyderabad is a breeding ground for terrorists

దేశంలో ఎక్కడ టెర్రర్ ఎటాక్ జరిగిన అందులో ప్రముఖంగా హైదరాబాద్ పేరు వినిపిస్తోంది.ఇందుకు కారణాలు తెలుసుకోవాలంటే ముందుగా మనం హైదరాబాద్ చరిత్ర తెలుసుకోవలసి వుంది.ఇండియాకి 1947 లో ఫ్రీడమ్ వస్తే ,హైదరాబాద్ కి మాత్రం 1948 లో నవాబు అరాచక పాలన నుండి ఫ్రీడమ్ వచ్చింది.అప్పటికే హైదరాబాద్ ని ఒక ఇస్లాం రాజ్యంగా మార్చాలని కళలు కన్న నవాబు తన వారసత్వాన్ని ప్రస్తుత ఒవైసీ తాత గారికి అప్పచెపటం జరిగింది.అప్పటికే హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ప్రజల్లో మత  పరమైన భేదాలు తారా స్థాయిలో  ఉండేవి.ఆ తర్వాత జరిగిన కొన్ని పోలీస్ చర్యల వల్ల ఓల్డ్ సిటీ యువతలో నరణరాన  హిందూ వ్యతేరిక భావాలూ అల్లుకుపోయాయ్. కొద్ది మంది స్వార్ధ రాజకీయ కారణాలు వల్ల నిత్యం హైదరాబాద్ ముస్లిం యువతలో  ఇతర మతాల పట్ల చులకన ,హేళన పెరిగింది.ఈ మత పిచ్చి ఎంతగా వుంది అంటే,2007 హైదరాబాద్ వరుస బాంబు పేలుల్లో  కారకూడయిన  మహమ్మద్ బలాల్ ని ఓల్డ్ సిటీ యువత తమ హీరోగా భావించేది.2015 లో వికారుద్దీన్ అంతిమ యాత్రకి వచ్చిన ముస్లిం యువతని చుస్తే ఆందోళన చెందక తప్పదు. ఇందుకు అధికార పార్టీల మెతక వైఖరి కూడా కారణంగా భావించాలి.బహిరంగ సభలలో ఇతర మతాలపై విద్వేష  ప్రసంగాలు చేసే ఒవైసీ బ్రదర్స్,ప్రవీణ్ తగొడియా లాంటి వారిపై కఠిన చర్యలు లేకపోవడం వల్ల అనేకమంది యువత ప్రభావితం అవుతుంది.టెర్రర్ సంస్థలకి హైదరాబాద్ ముస్లింల ఆర్ధిక వెనుక బాటు కూడా ఒక వరంలా మారింది.ఆర్ధిక ఇబ్బందులతో సతమత మవుతున్న యువతకి ఆర్ధిక సహాయం అందించి,వారిలో హిందూ వ్యతిరేక భావాలని పైచి టెర్రర్ వైపు అడుగులు వేసేలా చేస్తోంది.ఓల్డ్ సిటీ లోని మెజారిటీ యువత చదువుకి,ఉపాధికి దూరంగా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది.నిరాశ,నిష్రః లతో నిండి,పొట్ట కూటి కోసం కొందరు,ఇస్లాం రాజ్యమే లక్ష్యంగా మతోన్మాదంతో మరికొందరు యువత టెర్రరిజం వైపు అడుగులు వేస్తోంది. అందరికి ఉపాధి,విద్య ద్వారా మాత్రమె దీని నుండి బయట పడగలం.టెర్రర్ ఎటాక్ జరిగినప్పుడు హడావుడి చేయడం కాకుండా,సరిఅయిన రాజకీయ విధానాల ద్వారా మాత్రమే టెర్రరిజం వైపు చూస్తున్న యువతకి అడ్డుకట్ట వేయగలం.

నిజంగా దేశంలొ అసహనం పెరిగిందా??

దేశంలో  ఇంతకు ముందు కన్నా  మత కల్లోలాలు చాల  వరకు తగ్గిపోవడంతో, అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు.అయితే ప్రభుత్వం వైఖరి పట్ల ప్రజల్లో అసంతృప్తి మాత్రం స్పష్టంగా వుంది,అది కేవలం విధాన పరమైన అసంతృప్తి గానే చూడాలి,దానికి మత పరమైన విషయాలని కలిపి చూడడం కరెక్ట్  కాదు.నిజంగా దేశంలో మత పరమైన అసహనం ఉంటే పరిస్థితి  ఇంకోలా ఉండి  ఉండేది. అన్ని దేశాల్లో వున్న ప్రజాలకన్న ఇండియన్స్ కి కొంచం సహన ఎక్కువే అని చెప్పాలి.ఎందుకంటే,యూరప్ లేక అమెరికాలో వుంటున్న ముస్లింలు నిత్యం అవమానలతో సహజీవనం  చేయవలసిన పరిస్థితి అక్కడ ఉంది, కాని ఇండియాలో ప్రస్తుత పరిస్థితి ఆన్దుకు పూర్తిగా విరుద్ధంగా వుంది.ఇండియాలో మెజారిటీ ప్రజలు హిందువులు అయినప్పటికీ ,ఇక్కడ హిందూ దేవతలని,ఆచారాలని హేళన చేస్తూ ఎన్నో మూవీస్   వచ్చినప్పుడు,ఇక్కడి ప్రజలు నాస్తిక ముసుగులో వాటికి బ్రహారధం పట్టారు.ఇక్కడ మొత్తం జనాభాలో 12%  కూడా ముస్లింలు లేరు.కాని ఒక ముస్లిం పార్టీ నాయకుడు ఇష్టా రాజ్యంగా మాట్లాడుతున్న ,అతను దేశంలో ,చట్ట సభలో సభ్యుడుగా వుండి స్వేచ్చగా తిరుగుతున్నా ఏమి చేయని దేశం మనది.అదే అతను ఒక అమెరికాలో లేక యూరప్ లో ఉండి ఉంటే ఇప్పటికే ఉరి తీసి వుండేవారు బహుశ. ఇందంత కేవలం ఇండియాలో వున్న సహన శీలత గురించి చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయినప్పటికీ కొన్ని వర్గాల ప్రజలు ,కొన్ని చోట్ల అధికారం ముసుగులో చేస్తున్న ఆరాచకాలకి  అడ్డుకట్ట వేయవలసిన టైం వచ్చింది,చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ ప్రభుత్వాలు సరిగా స్పంధించని  పక్షంలో ప్రజల్లో అభద్రతా భావం పెరిగే ప్రమాదం వుంది.దేశ ప్రజల్లో,కొన్ని వర్గాల్లో  అభద్రతా భావాలూ దేశానికీ మంచిది కాదు.కొన్ని వర్గాల్లో అభద్రతా భావాలూ అంతర్గత సంఘర్షణకి దారి తీయవచ్చు.జై హింద్.
                                          -kvreddy