జమ్మలమడుగు ysrcp mla ఆది నారాయణ రెడ్డి పార్టీకి కొంత కాలంగ దూరంగా వుంటున్న సంగతి అందరికి తెలిసిందే.ఆది నారాయణ రెడ్డి పార్టీ మారుతారని చాలా కాలంగా మీడియా కోడై కూస్తుంది.కాని శనివారం రోజున ఆది నారాయణ రెడ్డికి జగన్ ఒక్కసారిగా షాక్ ఇచ్చారని చెప్పొచ్చు.చిన్న శుభ కార్యానికి వచ్చిన జగన్ తన అభిమానులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ చేసి ,ఆది నారాయణ రెడ్డి పార్టీ మారిన జమ్మలమడుగు ప్రజానీకం తన వెంటే ఉన్నారని నిరూపించారు.ఇక్కడ ఇంకో చెప్పుకోవలసిన విషయం ఏంటంటే ఆది నారాయణ రెడ్డి తమ్ముడు జగన్ని కలవడానికి జగన్ వాహన శ్రేణి వద్దకి వచ్చినప్పటికీ జగన్ పట్టించుకోకుండా,అభిమానులకు అభివాదం చేస్తూ తన రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్డుషో కార్యక్రమం మొత్తం కూడా ఆది నారాయణ రెడ్డికి తెలియకుండా,ysrcp జమ్మలమడుగు యువనేత హనుమంత రెడ్డి నాయకత్వంలో జరగడంతో ఆది నారాయణ రెడ్డి వర్గం లో ఆందోళన మొదలేయింది.జగన్ సడన్ ర్యాలీ తో ఆది నారాయణ రెడ్డి పార్టీ మారిన అతని వెంట వెళ్ళే కార్యకర్తలు కొద్ది మంది మాత్రమె ఉంటారని,జగన్ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదని స్పష్టమయిందని చెప్పవచ్చు.మొత్తానికి ఆది నారాయణ రెడ్డి పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవాడిలా ఐయ్యిందని చెప్పాలి.ఇప్పుడు ఆది నారాయణ రెడ్డి వర్గంలో వున్నా ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అతనికి దూరంగా వుండి,జగన్ శిబిరం వైపు చూస్తున్నారట.జగన్ కూడా వెళ్ళే వాళ్ళ గురించి పెద్దగ పట్టించుకోను అనే సింబాలిక్ గానే ఈ ర్యాలీ చేసి , భళా ప్రదర్శన చేసాడనుకోవచ్చు.