SNAPDEAL

నిజంగా దేశంలొ అసహనం పెరిగిందా??

దేశంలో  ఇంతకు ముందు కన్నా  మత కల్లోలాలు చాల  వరకు తగ్గిపోవడంతో, అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు.అయితే ప్రభుత్వం వైఖరి పట్ల ప్రజల్లో అసంతృప్తి మాత్రం స్పష్టంగా వుంది,అది కేవలం విధాన పరమైన అసంతృప్తి గానే చూడాలి,దానికి మత పరమైన విషయాలని కలిపి చూడడం కరెక్ట్  కాదు.నిజంగా దేశంలో మత పరమైన అసహనం ఉంటే పరిస్థితి  ఇంకోలా ఉండి  ఉండేది. అన్ని దేశాల్లో వున్న ప్రజాలకన్న ఇండియన్స్ కి కొంచం సహన ఎక్కువే అని చెప్పాలి.ఎందుకంటే,యూరప్ లేక అమెరికాలో వుంటున్న ముస్లింలు నిత్యం అవమానలతో సహజీవనం  చేయవలసిన పరిస్థితి అక్కడ ఉంది, కాని ఇండియాలో ప్రస్తుత పరిస్థితి ఆన్దుకు పూర్తిగా విరుద్ధంగా వుంది.ఇండియాలో మెజారిటీ ప్రజలు హిందువులు అయినప్పటికీ ,ఇక్కడ హిందూ దేవతలని,ఆచారాలని హేళన చేస్తూ ఎన్నో మూవీస్   వచ్చినప్పుడు,ఇక్కడి ప్రజలు నాస్తిక ముసుగులో వాటికి బ్రహారధం పట్టారు.ఇక్కడ మొత్తం జనాభాలో 12%  కూడా ముస్లింలు లేరు.కాని ఒక ముస్లిం పార్టీ నాయకుడు ఇష్టా రాజ్యంగా మాట్లాడుతున్న ,అతను దేశంలో ,చట్ట సభలో సభ్యుడుగా వుండి స్వేచ్చగా తిరుగుతున్నా ఏమి చేయని దేశం మనది.అదే అతను ఒక అమెరికాలో లేక యూరప్ లో ఉండి ఉంటే ఇప్పటికే ఉరి తీసి వుండేవారు బహుశ. ఇందంత కేవలం ఇండియాలో వున్న సహన శీలత గురించి చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయినప్పటికీ కొన్ని వర్గాల ప్రజలు ,కొన్ని చోట్ల అధికారం ముసుగులో చేస్తున్న ఆరాచకాలకి  అడ్డుకట్ట వేయవలసిన టైం వచ్చింది,చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ ప్రభుత్వాలు సరిగా స్పంధించని  పక్షంలో ప్రజల్లో అభద్రతా భావం పెరిగే ప్రమాదం వుంది.దేశ ప్రజల్లో,కొన్ని వర్గాల్లో  అభద్రతా భావాలూ దేశానికీ మంచిది కాదు.కొన్ని వర్గాల్లో అభద్రతా భావాలూ అంతర్గత సంఘర్షణకి దారి తీయవచ్చు.జై హింద్.
                                          -kvreddy