SNAPDEAL

Reservations in india

భారత రాజ్యాంగం దేశంలో తరతరాలుగా సామాజికంగా,ఆర్ధికంగా అణచివేయబడిన కొన్ని వర్గాల ప్రజలకు కొన్ని ప్రత్యేక సదుపాయల్ని కల్పించింది,వాటినే మనం రిజర్వేషన్స్ అంటున్నాం.భారత్లో రిజర్వేషన్స్ ని ఇలా కూడా డిఫైన్ చేయవచ్చు " The setting aside of a certain percentage of vacancies in government institutions for members of backward and underrepresented communities (defined primarily by caste and tribe)."  భారత్ దేశములో 1950 జనవరి 26 నుండి రిజర్వేషన్స్ అధికారికంగా అమలులోకి వచ్చాయి.( బ్రిటిష్ వారికి ముందు కూడా దేశంలో  కొన్ని వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్స్ వుండేవి).అయితే సుప్రీంకోర్టు  ఆదేశాలు మేరకు రిజర్వేషన్స్ 50% కన్నా మించకూడదు.( ఒకానొక సందర్భంలో తమిళనాడు ప్రభుత్వం 69% రిజర్వేషన్స్ అమలు చేసింది.).
                                    ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని ఉన్నత వర్గాలు కూడా తమకు రిజర్వేషన్స్ కావాలని రోడ్డులేకుతున్నాయ్.ఉన్నత వర్గాల ప్రజలు రిజర్వేషన్స్ కారణంగా తాము వెనుకబడి పోయాం అనే భావనకొచ్చాయ్.ఇందులో కొంత నిజం కూడా వుంది.గుజరాత్లో  గత  కొంత కాలంలో జరిగిన పటేల్ ఉద్యమం అందులో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ పటేల్ ఉద్యమం ఎక్కువ కాలం నిలబడలేదు.పటేల్ ఉద్యమం కొద్ది కాలానికే చల్లబడడానికి ప్రధాన కారణం అందులో హేతుబద్దత లేకపోవడం.హేతుబద్దత లేని ,కొన్ని వర్గాల ప్రజల సెంటిమెంట్ తో వచ్చే ఉద్యమాలు ఎక్కువ కాలం వుండలేవు.గుజరాత్లోని పటేల్లు రిజర్వేషన్స్ కోసం ఉద్యమాలు చేయడమంటే,అది తెలుగు రాష్ట్రాలలోని రెడ్లు,కమ్మ, ,రావు,కాపు ( కాపులని రాయలసీమ లో బలిజ అని,తెలంగాణాలో నాయుడుగా పిలుస్తారు) వర్గాల ప్రజలు రిజర్వేషన్స్ కోసం ఉద్యమాలు చేయడం లాంటిది.
                    రిజర్వేషన్స్ ని వ్యతిరేకించే ప్రజలు ముందుగా రిజర్వేషన్స్ ఎందుకు కల్పించారో తెలుసుకోవాలి.రిజర్వేషన్స్ అనేవి కేవలం ఆర్ధిక వెనుకబాటు పై మాత్రమె కాక, మన సమాజంలో కొన్ని వందల సంవత్సరాలుగా నిమ్న కులాలు,దళితులుగా ముద్ర వేయబడి ,సామాజిక బహిష్కరణకి,అంటరాని వారిగా అణచివేయబడిన కొన్ని వర్గాల ప్రజలని  ప్రభుత్వ పాలనలో బాగస్వామ్యులను చేస్తూ,ఆర్ధికంగా నిలదొక్కుకొని,సమాజంలో అందరితో సమానంగా ఎదగడం కోసం కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఎదురవుతుంది.నేటి ఆధునిక సమాజంలో ఆర్థికంగా బలపడినప్పుడు,నిమ్న కులాల వారికి రిజర్వేషన్స్ ఎందుకు??  ఇక్కడ నాకు తెలిసిన కొన్ని సంఘటనలు చెప్తా.లోక్సభ మాజీ స్పీకర్ "జీఎంసీ.బాలయోగి " తను లోక్సభ స్పీకర్ గా ఉన్నప్పుడు తన సొంత ఊరు " ఎదురులంక" గ్రామంలో శివాలయ సంకుస్థాపనకి వెళ్ళినప్పుడు అతను దళితుడు అనే కారణంతో అక్కడి ప్రజలు అతన్ని  అడ్డుకోవడం జరిగింది.అప్పటికే ఆతను ఆర్థికంగా మంచి స్థాయిలో వుండి, లోక్సభ స్పీకర్ అయి వుండి ఏమి చేయలేని దుస్థితి.అందుకు కారణం మన కుల వ్యవస్థ.అయితే అది ఎప్పుడో జరిగిన ఘటన.ప్రస్తుత పరిస్థితి చూస్తే,హైద్రాబాద్లోని మెజారిటీ బ్రాహ్మణులు తమ ఇళ్లను దళితులకి,తక్కువ కులస్తులకి  రెంటుకు ఇవ్వరు అంటే నమ్మకపోవచ్చు,కాని నిజం.
                                   అయితే రిజర్వేషన్స్ కి ఆల్టర్నేట్ లేదా?? అంటే ,ప్రస్తుతానికి సమాధానం లేకపోవచ్చు. రిజర్వేషన్స్ లేని భారత్ కావాలంటే ,ముందుగా కుల రహిత సమాజ నిర్మాణం జరగాలి.రిజర్వేషన్స్ తీసివేయలంటే ఉన్నత వర్గాలుగా సమాజంలో చెలామణి అవుతున్న ప్రజానీకం కులం ముసుగులో తాము పొందుతున్న కొన్ని ప్రత్యేక లాభాలని వదులుకోవలసి ఉంటుంది, ఇవి ఆర్ధిక పరమయినవి కావు,కేవలం సామాజిక పరమయినవి.అప్పుడు మాత్రమె కులసహిత రిజర్వేషన్స్ పోయి,ఆర్ధిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్స్ కి అవకాశం ఉంటుంది.అయితే ఇప్పుడు కొద్ది మంది యువత ,రిజర్వేషన్స్ అనుభవిస్తున్న వారిలో ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారికి రిజర్వేషన్స్ తీసివేసి,ఆర్ధికంగా వెనుక బడి వున్న ఉన్నత కులాల వారికి రెజర్వేషన్స్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇది వినడానికి కరెక్టుగా ఉన్నప్పటికీ ఆచరణ సాధ్యం కాకపోవచ్చు.ఎందుకంటే ప్రస్తుత సమాజంలో తప్పుడు  income certificate తెచ్చుకోవడం చాల సులభం,కాని తప్పుడు caste certificate అంత ఈజీగా రాదు,వచ్చిన భవిష్యత్తులో అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
                               అయితే రిజర్వేషన్స్ వాళ్ళ కొన్ని వర్గాల ప్రజలు తమకు అన్యాయం జరిగిందని ,జరుగుతుందని ఆవేదన చెందుతున్న మాట వాస్తవం. ఇప్పటికీ 65 years దాటినప్పటికి రిజర్వేషన్స్ కల్పించి,ఆయా వర్గాల ప్రజల్లో అనుకున్న స్థాయిలో అభివృద్ధి లేదని చెప్పాలి.ఇందుకు మన రాజకీయ వ్యవస్తే ప్రధాన కారణం. దేశంలో దళితుల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం కూడా చిత్త శుద్ధితో పనిచేయలేదు.కేవలం ప్రతి 5 years కి ఒక సారి వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ,తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికలప్పుడు మాత్రమే దళితులు ,వారి భాధలు గురించి ప్రభుత్వాలకి గుర్తుకు వస్తాయి.దీనికి  ప్రధాన కారణం దలితుల్లో చైతన్యం లేకపోవడం.కొద్దోగొప్పో చాయితన్యవంతులయిన దళితులు ఆయా రాజకీయ పార్టీలకి బానిసలుగా మారి ఊడిగం చేస్తున్నారు.  దళితుల్లో చైతన్యం రావాలి,అర్హులయిన వారికి కచ్చితంగా రిజర్వేషన్స్ అందేలా చూడడం ద్వారా మాత్రమె ,ఇంకో 20 years లో అయిన రిజర్వేషన్స్ అవసరంలేని భారత్ని చూడొచ్చు.ప్రభుత్వాలు కూడా తాత్కాలిక తాయిలాలు కాకుండా,అన్ని వర్గాల ప్రజలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేలా చూడడం మాత్రమే సర్వరోగ నివారిణి.